![]() |
![]() |

కెరీర్ బిగినింగ్ నుంచి ప్రతీ ఏడాది తన సినిమాలతో సందడి చేస్తూ వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఎప్పుడైతే పొలిటికల్ గా బిజీ అయ్యారో అప్పట్నుంచి సినిమాలకు బ్రేకిచ్చారు. దాదాపు పదేళ్ళ గ్యాప్ తరువాత 'ఖైదీ నంబర్ 150'తో రీ-ఎంట్రీ ఇచ్చిన చిరు.. రకరకాల కారణాల వల్ల మునుపటిలా ప్రతీ క్యాలెండర్ ఇయర్ లో పలకరించలేకపోతున్నారు. 'ఖైదీ నంబర్ 150'కి, 'సైరా.. నరసింహారెడ్డి' నడుమ రెండున్నరేళ్ళకి పైగా గ్యాప్ రాగా.. 'సైరా', 'ఆచార్య'కి కూడా దాదాపు ఒకటిన్నర సంవత్సరం గ్యాప్ వస్తోంది.
అయితే ఆ తరువాత మాత్రం వెంటనే తన సినిమా వచ్చేలా ప్లాన్ చేశారు చిరు. అన్నీ కుదిరితే 2021లో మెగాస్టార్ నుంచి డబుల్ ధమాకా ని ఎక్స్ పెక్ట్ చేయొచ్చన్నది ఆయన సన్నిహిత వర్గాల మాట. 2021 వేసవికి 'ఆచార్య' విడుదల కానుండగా.. అదే సంవత్సరం విజయదశమికి 'వేదాళమ్' రీమేక్ రిలీజ్ అయ్యే స్కోప్ ఉందని టాక్. సో.. మెగాభిమానులకు ఇది సూపర్ గూడ్ న్యూసే.
![]() |
![]() |