![]() |
![]() |

అటు గ్లామర్ రోల్స్ తోనూ, ఇటు పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ తోనూ ఎంటర్ టైన్ చేస్తున్న నాయికల్లో రాశీఖన్నా ఒకరు. తొలిప్రేమ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తీసుకువచ్చిన రాశి.. ఆ తరువాత మాత్రం ఆ స్థాయి పాత్రలో కనిపించనేలేదు. తాజా సమాచారం ప్రకారం.. అలాంటి అవకాశం ఒకటి రాశి చెంతకు చేరిందని తెలిసింది.
ఆ వివరాల్లోకి వెళితే.. మాలీవుడ్ యూత్ ఐకాన్ దుల్కర్ సల్మాన్, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ పిరియడ్ రొమాంటిక్ సాగా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు నాయికలకు స్థానమున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, రష్మిక మందన్న హీరోయిన్స్ గా నటించబోతున్నట్లు ఇప్పటికే కథనాలు వచ్చాయి.
అయితే కాల్షీట్ ఇష్యూస్ తో రష్మిక ఈ సినిమా నుంచి తప్పుకుందని.. ఇప్పుడా పాత్రలో రాశి కనిపించబోతోందని టాక్. నటనకు అవకాశమున్న పాత్ర కావడంతో సెకండ్ థాట్ లేకుండా ఈ రోల్ కి ఓకే చెప్పేసిందట మిస్ ఖన్నా. కాగా, జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంస్థలు నిర్మిస్తున్నాయి.
![]() |
![]() |