![]() |
![]() |

నటసింహ నందమూరి బాలకృష్ణ సరసన కనువిందు చేసిన నాయికల్లో మీనా ఒకరు. అశ్వమేథం, బొబ్బిలి సింహం, ముద్దుల మొగుడు, క్రిష్ణబాబు చిత్రాల్లో ఈ ఇద్దరి జోడీ ఎంటర్ టైన్ చేసింది. వీటిలో బొబ్బిలి సింహం చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. కట్ చేస్తే.. దాదాపు 22 ఏళ్ళ తరువాత బాలయ్య, మీనా మరోసారి జట్టుకట్టనున్నారని టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. సింహా, లెజెండ్ తరువాత బాలయ్య, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య రెండు పాత్రల్లో సందడి చేయనున్నారు. అందులో ఒకటి... అఘోరా పాత్ర. ఈ పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో మీనా దర్శనమిస్తుందట. అతిథి పాత్రే అయినా అభినయానికి అవకాశమున్న భూమిక ఇదని సమాచారం. త్వరలోనే BB3లో మీనా ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం తమన్ సంగీతమందిస్తున్నాడు.
![]() |
![]() |