![]() |
![]() |

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అనిపించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఇంక తన దృష్టి బాలీవుడ్ మీదే కేంద్రీకరిస్తున్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే.. ప్రస్తుతం ఆమె మూడు హిందీ సినిమాలు చేస్తోంది. అర్జున్ కపూర్‌తో 'సర్దార్ అండ్ గ్రాండ్సన్', జాన్ అబ్రహాం సరసన 'ఎటాక్', అజయ్ దేవ్‌గణ్‌తో 'మేడే' సినిమాలు ఆమె చేస్తోంది. అంటే ఇప్పుడక్కడ ఆమెకు మంచి డిమాండ్ ఉన్నట్లే లెక్క.
మరోవైపు తెలుగులో ఆమె ఇటీవలే క్రిష్ డైరెక్షన్‌లో 'కొండపొలం' నవల ఆధారంగా ఓ సినిమాని పూర్తి చేసింది. ఇందులో వైష్ణవ్ తేజ్ హీరో. ప్రస్తుతం నితిన్ జోడీగా చంద్రశేఖర్ ఏలేటి డైరెక్ట్ చేస్తోన్న 'చెక్' మూవీలో నటిస్తోంది. అయితే టాప్ స్టార్ల సినిమాల్లో ఆమెకు అవకాశాలు లేకపోవడం ఇక్కడ గమనార్హం. 2019లో సీనియర్ స్టార్ నాగార్జున జోడీగా నటించిన 'మన్మథుడు 2' మూవీ ఆమెకు చేదు జ్ఞాపకాలు మిగిల్చింది. దానికంటే ముందు సూపర్‌స్టార్ మహేశ్ సరసన '2017'లో స్పైడర్ సినిమాలో నాయికగా ఆమె కనిపించింది. అంతకుముందు వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు పొందుతూ వచ్చిన ఆమెకు ఉన్నట్లుండి వారి సినిమాల్లో అవకాశాలు లేకుండా పోవడం గమనార్హం.
తమిళంలోనూ ఆమెకు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. శివ కార్తికేయన్‌తో 'అయలాన్' అనే సైన్స్ ఫిక్షన్ మూవీలో నటిస్తోన్న ఆమె, కమల్ హాసన్ 'ఇండియన్ 2' మూవీ చేస్తోంది. అయితే ఈ రెండో దానిలో ఆమె చేస్తోంది సెకండ్ హీరోయిన్ రోల్. అంటే సౌత్‌లో కంటే నార్త్‌లోనే ఆమెకు ఇప్పుడు బెటర్ ఆపర్చునిటీస్ వస్తున్నాయన్న మాట. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి కాబట్టి, బాలీవుడ్ నుంచి వస్తున్న అవకాశాలను రెండు చేతులా ఆహ్వానిస్తోంది రకుల్. సమీప భవిష్యత్తులోనే ఆమె కూడా ఇలియానా తరహాలో అక్కడే సెటిల్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
![]() |
![]() |