![]() |
![]() |

సూపర్‌స్టార్ రజనీకాంత్ పెట్టనున్న రాజకీయ పార్టీ రానున్న తమిళనాటు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 సీట్లలోనూ పోటీ చేయనుంది. ఈ విషయాన్ని రజనీ రాజకీయ సలహాదారుగా నియమితులైన తమిళరువి మణ్యన్ వెల్లడించారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన, "వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో మొత్తం 24 సీట్లలో మేం పోటీ చేస్తాం. ప్రస్తుతం నడుస్తున్న ద్వేషపూరిత రాజకీయాల మాదిరిగా కాకుండా మావి ఆధ్యాత్మిక రాజకీయాలు. మేం ఎవరినీ కించపరచం" అని చెప్పారు.
మణ్యన్ కాంగ్రెస్ మాజీ నేత. రజనీ పెట్టనున్న పార్టీకి, దాని ప్రారంభ కార్యక్రమానికీ ఆయన పర్యవేక్షకుడిగా వ్యవహరించనున్నారు. అన్ని రకాల వదంతులకు ఫుల్‌స్టాప్ పెడుతూ, జనవరిలో తన రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు గురువారం రజనీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరున పార్టీని ఏ రోజున ప్రారంభించేదీ తెలియజేస్తామని ఆయన చెప్పారు.
రజనీ ఆధ్యాత్మిక రాజకీయాల గురించి వివరణ ఇస్తూ, "ఆధ్యాత్మికతకు మతం లేదు. ఆధ్యాత్మికవేత్త అనేవాడు ప్రతి జీవిలోనూ తనను తాను చూసుకుంటాడు, తనలో అందరినీ చూసుకుంటాడు. అతనికి కులం, మతం, వివక్ష లేదు. ఆధ్యాత్మికత అంటే అందరినీ ప్రేమతో ఆలింగనం చేసుకోవడం. రజినీ అలా చేయబోతున్నాడు." అని మణ్యన్ తెలిపారు.
2021లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి.
![]() |
![]() |