![]() |
![]() |

సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్‌కు ఫ్యామిలీ ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. క్లాస్ మూవీస్‌తో మహిళల ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఎప్పటికప్పుడు పెంచేసుకుంటున్నారు. వెంకీ తనకున్న క్రేజ్ పెంచుకోడానికి కనిపెట్టిన రూట్.. రీమేక్. సేఫ్ ఫార్ములా. రీమేక్స్‌తో ఆయన విజయపధంలో దూసుకువెళుతున్నారు. తన సక్సెస్ రేట్ పెంచుకోవడానికి రీమేక్ మూవీస్‌లో నటించడానికే ఆయన ఉత్సాహం చూపిస్తున్నారు. బాడీగార్డ్ (2012), దృశ్యం (2014), గోపాల గోపాల (2015), గురు (2017) లాంటి సక్సెస్‌ఫుల్ సినిమాలు రీమేక్‌లే. 2012 నుంచి 2019 వరకు ఆయన 10 సినిమాలు చేస్తే వాటిలో 5 రీమేక్‌లు కావడం గమనార్హం.
ఓ వైపు ఒరిజినల్ స్టోరీలు, మరోవైపు రీమేక్స్‌తో ఆయన తన సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటున్న తీరు ఇంప్రెసివ్‌గా ఉంటోందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఇతర భాషల్లో హిట్ అయిన కథలను టాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. తను ఫాలో అవుతున్న ఈ సేఫ్ ఫార్ములాతో అటు సక్సెస్ సాధిస్తున్నారు. ఇటు ప్రేక్షకుల్లో క్రేజ్‌ను పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో చేస్తున్న 'నారప్ప' కూడా రీమేకే. తమిళంలో ధనుష్ నటించగా బ్లాక్‌స్టర్ అయిన 'అసురన్'కు ఇది తెలుగు వెర్షన్. ఈ మూవీ తర్వాత తిరిగి ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఒరిజినల్ స్టోరీతో 'ఎఫ్3' చేస్తున్నారు.
![]() |
![]() |