![]() |
![]() |

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసిందే. దీనికి సీక్వెల్ గా 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' రూపొందుతోంది. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు షూటింగ్ పూర్తయిపోయిన ఈ సినిమాలో సంజయ్ దత్, రావు రమేష్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, నేడు(మే 25) రావు రమేష్ బర్త్ డే సందర్భంగా.. కేజీఎఫ్-2 నుంచి ఆయన లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
కేజీఎఫ్ 2 చిత్రంలో రావు రమేష్ కన్నెగంటి రాఘవన్ అనే పాత్ర పోషిస్తున్నారు. రాకీ భాయ్ కేసును డీల్ చేసే సీబీఐ ఆఫీసర్ గా ఆయన కనిపించనున్నారు. నేడు రావు రమేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన రోల్ పై స్పెషల్ మ్యాగజైన్ రిలీజ్ చేసింది కేజీఎఫ్ టీమ్. “సీబీఐ అత్యున్నత అధికారి కన్నెగంటి రాఘవన్ పుట్టినరోజు నేడు".. "ఇప్పుడు సీబీఐ ఇంటరెస్ట్ ఏమిటి? కేజీఎఫ్ లేదా రాకీనా?" వంటి హెడ్ లైన్స్ తో కేజీఎఫ్ టైమ్స్ పేరుతో మేకర్స్ మ్యాగజైన్ రిలీజ్ చేశారు.

పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్ సంచనలం సృష్ఠించింది. చిత్రాన్ని జులై 16న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ‘కేజీఎఫ్2’ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం దసరాకు విడుదలయ్యే అవకాశముంది.
![]() |
![]() |