![]() |
![]() |
.jpg)
రెబల్ స్టార్ కృష్ణంరాజు - దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన చిత్రాల్లో సింహభాగం బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. వాటిలో `బొబ్బిలి బ్రహ్మన్న` ఒకటి. ఇందులో బ్రహ్మన్న, రవిగా కృష్ణంరాజు ద్విపాత్రాభినయం చేయగా.. శారద, జయసుధ నాయికలుగా నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో రావుగోపాలరావు, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, నూతన్ ప్రసాద్, అన్నపూర్ణ, ముచ్చర్ల అరుణ, కృష్ణవేణి దర్శనమిచ్చారు.
చక్రవర్తి సంగీతసారథ్యంలో రూపొందిన పాటల్లో ``చలిగాలి వీచింది``, ``అబ్బా నాతో``, ``తద్దినక తద్దినక మల్లెలు తెచ్చా`` వంటి రొమాంటిక్ సాంగ్స్ తో పాటు ``ఓ రాతి మనిషి``, ``బొబ్బిలి బ్రహ్మన్న వీర గాథలు`` అంటూ సందర్భానుసారంగా సాగే గీతాలు కూడా అప్పటి ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. `ఉత్తమ కథానాయకుడు`, `ఉత్తమ దర్శకుడు`, `ఉత్తమ సహాయనటి` (శారద) విభాగాల్లో `నంది` పురస్కారాలు.. `ఉత్తమ కథానాయకుడు`గా `ఫిల్మ్ ఫేర్` అవార్డుని సొంతం చేసుకుందీ చిత్రం.
గోపీకృష్ణా మూవీస్ పతాకంపై కృష్ణంరాజు సమర్పణలో ఆయన సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1984 మే 25న విడుదలై అఖండ విజయం సాధించిన `బొబ్బిలి బ్రహ్మన్న`.. నేటితో 37 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |