![]() |
![]() |

తెలుగునాట అగ్ర కథానాయకులతోనే సినిమాలు చేస్తూ వస్తున్న టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి.. త్వరలో కోలీవుడ్ స్టార్ విజయ్ కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కనున్నట్లు సమాచారం. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనని విజయ్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 22న రివీల్ చేయబోతున్నట్లు బజ్. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానున్నది.
కాగా, ప్రస్తుతం విజయ్.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఇందులో విజయ్ కి జోడీగా `బుట్టబొమ్మ` పూజా హెగ్డే నటిస్తోంది. దాదాపు తొమ్మిదేళ్ళ తరువాత పూజ
నటిస్తున్న తమిళ సినిమా ఇదే కావడం విశేషం. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ బాణీలు అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది.
![]() |
![]() |