![]() |
![]() |

నాట్యగురు పద్మభూషణ్ దివంగత వెంపటి చినసత్యం కుమారుడు వెంపటి వెంకట్ (నాని) నేటి ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ఆయన మృతితో వెంపటి వారసత్వం ముగిసినట్లయింది. కూచిపూడి గ్రామ అభివృద్ధి కోసం, కూచిపూడి నాట్య వికాసం కోసం పరితపించి జీవితాన్ని అంకితం చేసిన నాని ఇలా అర్ధాంతరంగా, ఆకస్మికంగా మరణించడంతో నాట్య రంగం ఒక ప్రతిభావంతుడిని కోల్పోయినట్లయింది. ఆయన మృతి నాట్యరంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకొనే క్రమంలో ఆనాటి వైభవాన్ని తిరిగి తీసుకు రావాలని వెంకట్ పరితపిస్తూ వచ్చారు. ఆయన మంచి ఆర్గనైజర్ గా గుర్తింపు పొందారు. ఆయన కార్యనిర్వహణా దక్షత అద్భుతంగా ఉండేదని ఆయనను సన్నిహితంగా చూసినవాళ్లు చెప్తున్న మాట. ఆయన మృతితో కూచిపూడి కళాక్షేత్ర ఒంటరిదైపోయింది. నాట్యాభిమానులంతా ఆయన మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
"ఇంత తొందరగా వెంపటి వెంకట్ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధాకరం. నిజంగా చాలా దురదృష్టకరం. ఈ క్లిష్ట కాలంలో ఆయన కుటుంబ సభ్యులకు శక్తినివ్వాలని అందరం ప్రార్థిద్దాం." అని ఆనంద్ కూచిభొట్ల అన్నారు.
![]() |
![]() |