![]() |
![]() |

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షించారు. ఎట్టకేలకు తారక్ కరోనా నుంచి కోలుకున్నారు. తనకి కరోనా నెగటివ్ వచ్చిన విషయాన్ని తెలియజేస్తూ తారక్ తాజాగా ట్వీట్ చేశారు.
"కరోనా టెస్ట్ లో నెగటివ్ వచ్చిందని చెప్పడానికి సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. కిమ్స్ హాస్పిటల్ కు చెందిన డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి, మా కజిన్ డాక్టర్ వీరు మరియు టెనెట్ డయాగ్నిస్టిక్స్‌లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను." అంటూ తారక్ ట్వీట్ చేశారు.
అలాగే కరోనా విషయంలో అశ్రద్ధ పనికిరాదని, అదే సమయంలో ధైర్యంగా పోరాడాలని తారక్ సూచించారు. "కోవిడ్ 19ను చాలా సీరియస్ గానే పరిగణించాలి. అయితే మంచి జాగ్రత్తలు తీసుకుంటూ, పాజిటివ్ మైండ్ తో ఉంటే దీన్ని సులభంగా జయించవచ్చు. మీ ధైర్యమే మీకు పెద్ద ఆయుధం. ధైర్యంగా ఉండండి.. భయపడకండి" అని తారక్ ట్వీట్ లో పేర్కొన్నారు.
![]() |
![]() |