![]() |
![]() |

ఇటీవలే ఓ ఇంటివాడయ్యారు దగ్గుబాటి రానా. మరోవైపు కొత్త సినిమాలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. రానా మల్టిలింగ్వల్ ఫిల్మ్ 'అరణ్య' సంక్రాంతికి సందడి చేయనుండగా.. 'విరాట పర్వం' చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. అలాగే వెటరన్ డైరెక్టర్ గుణశేఖర్ కాంబినేషన్ లో 'హిరణ్య కశ్యప' చేయబోతున్నారు. వచ్చే ఏడాది ఈ క్రేజీ వెంచర్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశముంది.
మరోవైపు.. 'గృహం' లాంటి విజయవంతమైన హారర్ థ్రిల్లర్ తో ఆకట్టుకున్న మిళింద్ రావ్ దర్శకత్వంలోనూ రానా ఓ హారర్ ఫ్లిక్ చేయనున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ ట్రైలింగ్వల్ వెంచర్ కి సంబంధించి తెలుగు టైటిల్ గా 'ధీరుడు' అనుకుంటున్నారని సమాచారం. సీనియర్ ప్రొడ్యూసర్ ఆచంట గోపీనాథ్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పించనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
![]() |
![]() |