![]() |
![]() |

టాలీవుడ్‌లో కంటే బాలీవుడ్‌లో బిజీగా ఉంటూ, అక్కడ పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ "జీవితంలో ఎదురయ్యే ఫెయిల్యూర్స్‌కు కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లినప్పుడే మనల్ని మరిన్ని సక్సెస్‌లు పలకరిస్తాయి" అంటోంది. జీవితంలో తనకు ఎదురయ్యే వైఫల్యాలను ఆమె ఎలా ఎదుర్కొంటోంది?
ఈ విషయం గురించి రకుల్ మాట్లాడుతూ, ‘‘నేను చేయాలనుకున్న పనిని పూర్తి ఆత్మవిశ్వాసంతో మొదలుపెడతాను. నాపై నాకు నమ్మకం ఎక్కువ. అది ఆత్మవిశ్వాసమే. కానీ మితిమీరిన విశ్వాసం కాదు. ఎంత కష్టపడ్డా కొన్నిసార్లు జీవితంలో వైఫల్యాలు మనల్ని పలకరిస్తాయి. అలాంటప్పుడు జీవితం విషయంలో భయపడాల్సిన పని లేదు. అవి మన గురించి మనం ఆలోచించుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. మన బలాలను గుర్తు చేస్తాయి. అపజయాలు మంచికే! అవి లేకపోతే మనం ఏమీ నేర్చుకోకుండా మిగిలిపోతాం. గమనించుకోవాలే కానీ వైఫల్యాల ద్వారానే మనకు జీవిత పాఠాలు బోధపడతాయి’’ అని చెప్పుకొచ్చింది.
తెలుగులో క్రిష్ డైరెక్షన్‌లో వైష్ణవ్ తేజ్ జోడీగా ఓ సినిమా పూర్తి చేసిన ఆమె, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ సరసన 'చెక్' సినిమా చేస్తోంది. ఇక బాలీవుడ్‌లో 'సర్దార్ అండ్ గ్రాండ్‌సన్', 'ఎటాక్', 'మేడే' సినిమాలతో అందరి దృష్టినీ తన వేపు తిప్పుకుంటోంది ఫిట్‌నెస్‌కు చాలా ప్రాముఖ్యం ఇచ్చే రకుల్.
![]() |
![]() |