![]() |
![]() |

2020లో తన మోస్ట్ ఫేవరేట్ పర్ఫార్మెన్స్‌గా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పడుకోనే పేర్కొన్న విషయం ఏమిటో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోక మానరు. ఇటీవలి రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో తాప్సీ పన్ను బిగినీ షూట్ వీడియోకు తాను ఫ్లాట్ అయిపోయాననీ, అది చూశాక తాప్సీకి తాను పెద్ద అభిమానిగా మారాననీ చెప్పింది దీపిక.
కొద్ది రోజుల క్రితం తన సిస్టర్స్, బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మాల్దీవులకు వెళ్లింది తాప్సీ. అక్కడ యశ్‌రాజ్ ముఖాతే రూపొందించిన బిగిని షూట్ సాంగ్‌కు తన సిస్టర్స్‌తో కలిసి డాన్స్ చేసింది. అందులో ఆమె బాయ్‌ఫ్రెండ్ మత్తయ్యాస్ బో కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. ఆ వీడియోలో తాప్సీ మూవ్‌మెంట్స్ చూసి కేక అనకుండా ఉండలేకపోయారు ఫ్యాన్స్. తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో తాప్సీ షేర్ చేసిన ఆ వీడియోకు ఇప్పటిదాకా 1.9 మిలియిన్ వ్యూస్ రావడం విశేషం. అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా సహా పలువురు సెలబ్రిటీలు కూడా తాప్సీని పొగుడుతూ కామెంట్లు పెట్టారు.
లేటెస్ట్‌గా ఫిల్మ్ జర్నలిస్ట్ రాజీవ్ మసంద్‌తో జరిగిన రౌండ్ టేబుల్ చాట్‌లో తాప్సీ వీడియో తనను బాగా ఇంప్రెస్ చేసి, ఆమె ఫ్యాన్ అయ్యేట్లు చేసిందని దీపిక వెల్లడించింది. "తాప్సీ.. నీ బిగిని షూట్ నా ఫేవరేట్ పర్ఫార్మన్స్. ఆ వీడియో చూశాక, నీకు పెద్ద ఫ్యాన్ అయ్యాను" అని చెప్పింది దీపిక. దీనికి తాప్సీ స్పందిస్తూ, ఫ్యూచర్‌లో దీపిక కోసం ఓ స్పెషల్ వీడియో చేస్తానని రిప్లై ఇచ్చింది.
.jpg)
![]() |
![]() |