![]() |
![]() |

తెలుగు నాట స్టార్ రైటర్ గా రాణిస్తున్నారు బుర్రా సాయిమాధవ్. ఎలాంటి జానర్ మూవీకైనా తన శైలి సంభాషణలు అందిస్తూ.. ఆయా చిత్రాల విజయాల్లో భాగమవుతున్నారాయన. ఇప్పటికే పలువురు యువ, అగ్ర కథానాయకుల చిత్రాలకి సాయిమాధవ్ మాటలు అందించారు. అయితే ఇంతవరకు మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో కలసి పనిచేయలేదీ టాలెంటెడ్ రైటర్. త్వరలోనే ఆ ముచ్చట కూడా నెరవేరనుందని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. వీర(2011) తరువాత రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ఖిలాడి. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజకి జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమా కోసమే సాయిమాధవ్.. తొలిసారిగా రవితేజ కాంబినేషన్ లో పనిచేయబోతున్నారట. త్వరలోనే ఖిలాడిలో సాయిమాధవ్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
మరి.. రవితేజ నోట సాయిమాధవ్ మాటలు ఏ స్థాయిలో అలరిస్తాయో చూడాలంటే 2021 వేసవి వరకు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |