![]() |
![]() |

సీనియర్ యాక్ట్రస్ అమల అక్కినేనికి నటిగా మంచి గుర్తింపు తీసుకువచ్చిన చిత్రాల్లో `పుష్పక విమానం` (1987), `రాజా విక్రమార్క` (1990)కి ప్రత్యేక స్థానముంది. వీటిలో లోకనాయకుడు కమల్ హాసన్ కి జంటగా అమల నటించిన `పుష్పక విమానం` క్లాసిక్ గా నిలవగా.. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా అమల ఆడిపాడిన `రాజా విక్రమార్క` మ్యూజికల్ గా మెప్పించింది.
కట్ చేస్తే.. ఇప్పుడీ టైటిల్స్ తో కొత్త సినిమాలు రాబోతున్నాయి. విశేషమేమిటంటే.. ఆ రెండు చిత్రాలు కూడా ఒకే రోజున థియేటర్స్ లో సందడి చేయబోతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నూతన దర్శకుడు శ్రీ సరిపల్లి రూపొందించిన `రాజా విక్రమార్క` నవంబర్ 12న రిలీజ్ కానుండగా.. ఆనంద్ దేవరకొండ హీరోగా కొత్త దర్శకుడు దామోదర తెరకెక్కించిన `పుష్పక విమానం` కూడా అదే రోజున తెరపైకి రానుంది. టైటిల్స్ లో తప్ప కథ పరంగా పాత చిత్రాలతో ఎలాంటి పోలికలు లేని ఈ సినిమాలు.. ఒకే రోజున పోటాపోటీగా బరిలోకి దిగుతున్న వైనం ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి.
కొసమెరుపు ఏంటంటే.. అటు `పుష్పక విమానం`, ఇటు `రాజా విక్రమార్క` కూడా అప్పట్లో ఆయా సంవత్సరాల్లో నవంబర్ నెలలోనే జనం ముందు నిలిచాయి.
![]() |
![]() |