![]() |
![]() |

బాక్సాఫీస్ ని ఉత్తేజపరిచే దర్శకుల్లో ఎస్. ఎస్. రాజమౌళి ఒకరు. అంతేకాదు.. `లోకల్` సినిమాలను `గ్లోబల్` స్థాయిలో మాట్లాడుకునేలా చేసిన వైనం జక్కన్న సొంతం. `బాహుబలి` సిరీస్ తో భళారే అనిపించుకున్న ఈ డైరెక్టర్ నెంబర్ వన్.. త్వరలో `ఆర్ ఆర్ ఆర్`తో మరోసారి తెలుగు సినిమా స్టామినా చూపబోతున్నారు. వాస్తవ పాత్రలకు కల్పిత ఘట్టాలను జోడీస్తూ.. ఈ స్టార్ కెప్టెన్ రూపొందించిన పిరియడ్ డ్రామా `ఆర్ ఆర్ ఆర్` సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఇప్పటివరకు పొంగల్ సీజన్ లో రాజమౌళి రూపొందించిన చిత్రాలేవీ సందడి చేసిన సందర్భం లేదు. తొట్ట తొలిసారిగా `ఆర్ ఆర్ ఆర్`తో ముగ్గుల పండక్కి పలకరించబోతున్నారు దర్శకధీరుడు. మరి.. అన్ సీజన్ లోనూ పలు మార్లు అద్భుతాలు సృష్టించిన జక్కన్న.. తెలుగువారికి ఎంతో ప్రీతిపాత్రమైన సంక్రాంతి సీజన్ లో ఇంకెలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.
కాగా అల్లూరి సీతారామరాజుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కొమురం భీమ్ గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన `ఆర్ ఆర్ ఆర్`కి స్వరవాణి కీరవాణి బాణీలు అందించారు. డీవీవీ దానయ్య ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు.
![]() |
![]() |