![]() |
![]() |

అభినయానికి ఆస్కారమున్న పాత్రల్లో అలరించే కథానాయికల్లో కీర్తి సురేశ్ ఒకరు. `హోమ్లీ హీరోయిన్`గా గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. కేవలం నాయిక పాత్రలకే పరిమితం కాకుండా యాక్టింగ్ కి స్కోప్ ఉన్న `సిస్టర్` రోల్స్ లోనూ కనిపించేందుకు ఆసక్తి చూపిస్తూ వార్తల్లో నిలుస్తోంది కీర్తి.
ఇదిలా ఉంటే.. వరుస సినిమాలతో తన అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది కీర్తి. కేవలం మూడు నెలల కాలంలో తను నటించిన ఐదు చిత్రాలు రిలీజ్ కి క్యూ కడుతుండడమే ఇందుకు నిదర్శనం. దీపావళి కానుకగా ఈ నెల 4న `అణ్ణాత్త` (తెలుగులో `పెద్దన్న`) రిలీజ్ కానుండగా.. ఇదే నెల 26న తను టైటిల్ రోల్ లో నటించిన `గుడ్ లక్ సఖి` తెరపైకి రానుంది. అలాగే.. 67వ జాతీయ చిత్ర పురస్కారాల్లో `ఉత్తమ చిత్రం`గా అవార్డు అందుకున్న మాలీవుడ్ మూవీ `మరక్కర్` పలు భాషల్లో ఈ నెలలోనే ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోంది. అదే విధంగా.. కీర్తి డీ-గ్లామర్ రోల్ లో నటించిన `సాణి కాయిదమ్` అనే తమిళ చిత్రం కూడా అతి త్వరలో ఓటీటీలో స్ట్రీమ్ కానుందని సమాచారం. ఇక జనవరిలో సంక్రాంతి కానుకగా తెలుగు చిత్రం `సర్కారు వారి పాట` థియేటర్స్ లో సందడి చేయనుంది. మొత్తంగా.. నవంబర్, డిసెంబర్, జనవరి ఇలా మూడు వరుస నెలల్లో కీర్తి నటించిన ఐదు ఆసక్తికరమైన చిత్రాలు ఎంటర్టైన్ చేయబోతున్నాయన్నమాట.
![]() |
![]() |