![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'ఆచార్య'. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సిద్ధ అనే ఒక కీలక పాత్రలో కనువిందు చేయనున్నాడు. చరణ్ కి నీలాంబరి పాత్రలో పూజ హెగ్డే సందడి చేయనుంది. తాజాగా ఈ సినిమా నుంచి చరణ్, పూజ ల మధ్య సాగే సాంగ్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది.
మణిశర్మ సంగీతం అందిస్తున్న 'ఆచార్య' నుంచి ఇప్పటికే విడుదలైన 'లాహే లాహే' సాంగ్ ఆకట్టుకోగా.. తాజాగా సెకండ్ సాంగ్ అప్డేట్ వచ్చింది. 'నీలాంబరి' అంటూ సాగే ఈ సాంగ్ లిరికల్ వీడియోను నవంబర్ 5 న ఉదయం 11:07 కు విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. చరణ్, పూజ లతో డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. వెనక నుంచి పూజ నడుము పట్టుకొని చరణ్ హత్తుకొని ఉండగా.. పూజ చేతిలో ఫ్లూట్ ను పట్టుకొని ఉంది. ఈ పోస్టర్ లాగానే 'నీలాంబరి' సాంగ్ కూడా మెప్పిస్తుందేమో చూడాలి.

'ఆచార్య' సినిమాలో చిరంజీవి సరసన్ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |