![]() |
![]() |

కరోనా కష్ట సమయంలో ఎందరికో అండగా నిలిచి గొప్ప మనసుని చాటుకున్న హీరోయిన్ ప్రణీతా సుభాష్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఇటీవల కన్నుమూసిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుర్తుగా ఒకరోజు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నట్లు ఆమె ప్రకటించారు.
పునీత్ ఆకస్మిక మరణంతో భారతీయ సినీపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సంగతి తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా దేశంలోని సినీ ప్రముఖులంతా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. నటుడిగా ఆయన ఎంతమందికి చేరువయ్యారో.. తన సేవా కార్యక్రమాలతోనూ పునీత్ అందరికీ అంతే దగ్గరయ్యారు. అందుకే పలువురు స్టార్స్ పునీత్ బాటలో పయనిస్తూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

ఇప్పటికే పునీత్ చదివిస్తోన్న 1,800 మంది పిల్లల బాధ్యతను కోలీవుడ్ స్టార్ విశాల్ తీసుకోగా.. తాజాగా కన్నడ బ్యూటీ ప్రణీత ఒకరోజు ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటుచేయనుంది. బెంగళూరు లోని అంబేడ్కర్ భవనంలో బుధవారం (నవంబర్3)న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఈ మెడికల్ క్యాంపు జరగనుంది. "అప్పూ సర్ ఎందరికో సాయం చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి అడుగుజాడల్లో నడవడమే ఆయనకు మనమిచ్చే అసలైన నివాళి" అంటూ మెడికల్ క్యాంప్ వివరాలను ప్రణీత సోషల్ మీడియాలో పంచుకున్నారు.
![]() |
![]() |