![]() |
![]() |

టిక్ టాక్, డబ్ స్మాష్ వీడియోస్ తో పాపులర్ అయిన మృణాళిని రవి.. `గద్దలకొండ గణేశ్`(2019)తో తెలుగు చిత్ర పరిశ్రమకు నాయికగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆపై `ఛాంపియన్` (2019) అనే తమిళ చిత్రంలో మెరిసింది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.
కట్ చేస్తే.. ఈ దీపావళికి రెండు సినిమాలతో సందడి చేయనుంది మృణాళిని. ఆ చిత్రాలే.. `ఎనిమీ`, `ఎంజీఆర్ మగన్`. విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించిన `ఎనిమీ` దీపావళి కానుకగా ఈ నెల 4న థియేటర్స్ లోకి రానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది. ఇక `ఎంజీఆర్ మగన్` విషయానికి వస్తే.. శశికుమార్, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తమిళ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అదే రోజున స్ట్రీమ్ కాబోతోంది. ఈ రెండు సినిమాల్లోనూ మృణాళిని నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లోనే మెరిసింది. మరి.. థియేటర్స్ లోనూ, ఓటీటీలోనూ ఒకే రోజు సందడి చేయనున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. ఎలాంటి ఫలితాలను, గుర్తింపుని పొందుతుందో చూడాలి.
కాగా, `ఎనిమీ`కి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించగా.. `ఎంజీఆర్ మగన్`ని పొన్ రామ్ డైరెక్ట్ చేశారు.
![]() |
![]() |