![]() |
![]() |

కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. రిపబ్లిక్ డేకి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, రీసెంట్గా విడుదల చేసిన ‘ట్రేడ్ మార్క్’ లిరికల్ వీడియో సాంగ్ ట్రెమండస్ రెస్పాన్స్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకుని మార్చి 17న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హీరో శ్రీకాంత్, విజయ్ ఎమ్. సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.
పునీత్ రాజ్‌కుమార్ ఆర్మీ ఆఫీసర్‌గా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్గా ప్రియా ఆనంద్ నటించగా, విలన్‌గా టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నటించారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, మార్చి 17న చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నామని.. హీరో శ్రీకాంత్‌తో కలిసి ఈ చిత్రాన్ని టాలీవుడ్లో విడుదల చేస్తున్న విజయ్ ఎమ్. తెలిపారు.
పునీత్ రాజ్‌కుమార్, డాక్టర్ శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, శరత్ కుమార్, ముఖేష్ రిషి, ఆదిత్య మీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: చరణ్ రాజ్, సినిమాటోగ్రఫీ: స్వామి జె. గౌడ, ఆర్ట్: రవి శాంతే హైక్‌లు, ఎడిటింగ్: దీపు ఎస్ కుమార్, పీఆర్వో: బి. వీరబాబు, నిర్మాత: కిశోర్ పత్తికొండ, దర్శకత్వం: చేతన్ కుమార్.

![]() |
![]() |