![]() |
![]() |

భారతీయ తెరపై శృంగార తార సన్నీ లియోన్ సందడి చేసి పదేళ్ళు కావస్తోంది. ఈ ప్రయాణంలో హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ ఎంటర్టైన్ చేసిందీ హాట్ బ్యూటీ. మరీముఖ్యంగా.. బాలీవుడ్ తరువాత సౌత్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా దర్శనమిచ్చింది సన్నీ లియోన్.
ఇదిలా ఉంటే, తెలుగునాట ఇదివరకు రెండు సినిమాల్లో మెరిసింది సన్నీ లియోన్. 2014లో విడుదలైన మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ మూవీ `కరెంట్ తీగ` కోసం ప్రత్యేక పాత్రలో అలరించిన సన్నీ.. ఆపై 2017లో రిలీజైన రాజశేఖర్ `గరుడవేగ` కోసం ``డియో డియో`` పాటలో తన చిందులతో కనువిందు చేసింది. కట్ చేస్తే.. ఐదేళ్ళ విరామం అనంతరం మళ్ళీ ఇప్పుడు మంచు విష్ణు టైటిల్ రోల్ లో నటిస్తున్న `గాలి నాగేశ్వరరావు`తో పలకరించబోతోంది సన్నీ. `ఆర్ ఎక్స్ 100` బ్యూటీ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సన్నీ గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.

మరి.. `కరెంట్ తీగ`, `గరుడవేగ` రూపంలో చెప్పుకోదగ్గ విజయాలు చూసిన సన్నీ లియోన్.. `గాలి నాగేశ్వరరావు`తో తెలుగునాట హ్యాట్రిక్ కొడుతుందేమో చూడాలి.
![]() |
![]() |