![]() |
![]() |

నేషనల్ క్రష్ రష్మికా మందన్న, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని.. ఈ ఇద్దరు భామలు కూడా 2018లో తెలుగు తెరపై తొలిసారిగా సందడి చేశారు. అంతేకాదు.. ఆయా సంవత్సరాల్లో టాలీవుడ్ లో మెమరబుల్ హిట్స్ అందుకున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుకి జోడీగా నటించిన `భరత్ అనే నేను`తో కియారా తన ఖాతాలో ఘనవిజయం వేసుకుంటే.. అదే ఏడాది యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండకి జంటగా సందడి చేసిన `గీత గోవిందం`తో రష్మిక స్టార్ డమ్ సొంతం చేసుకుంది. అలాంటి ఈ ఇద్దరు కూడా ఒకే రోజు బాక్సాఫీస్ వార్ కి సిద్ధమయ్యారు. అయితే, ఆ వార్ ఇక్కడ కాదు.. బాలీవుడ్ లో!
ఆ వివరాల్లోకి వెళితే.. రష్మిక కథానాయికగా నటించిన తొలి హిందీ చిత్రం `మిషన్ మజ్ను` జూన్ 10న సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతోంది. సరిగ్గా అదే రోజున కియారా అభినయించిన బాలీవుడ్ మూవీ `గోవింద నామ్ మేరా` కూడా థియేటర్స్ లోకి రాబోతోంది. మరి.. ఒకే రోజు బరిలోకి దిగుతున్న ఈ సినిమాలతో రష్మిక, కియారా ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
కాగా, శాంతను బాగ్చి డైరెక్ట్ చేసిన `మిషన్ మజ్ను`లో సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటించగా.. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన `గోవింద నామ్ మేరా`లో విక్కీ కౌశల్ హీరోగా సందడి చేయనున్నాడు.
![]() |
![]() |