![]() |
![]() |

కొణిదెల బ్రదర్స్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి ఈ వేసవి ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. కెరీర్ లో తొలిసారి ఒకే సమ్మర్ సీజన్ లో రెండేసి సినిమాలతో ఎంటర్టైన్ చేయనున్నారీ టాలెంటెడ్ స్టార్స్.
ఆ వివరాల్లోకి వెళితే.. దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో `మగధీర` వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత రామ్ చరణ్ నటించిన `ఆర్ ఆర్ ఆర్` వేసవి కానుకగా మార్చి 25న విడుదల కానుండగా.. విజనరీ కెప్టెన్ కొరటాల శివ కాంబినేషన్ లో మొదటిసారిగా పనిచేసిన `ఆచార్య` కూడా సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది. `ఆర్ ఆర్ ఆర్`లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న చరణ్.. `ఆచార్య`లో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించారు.
Also Read: 'రాధేశ్యామ్' ప్రీరిలీజ్ బిజినెస్.. 'సాహో' కంటే తక్కువే
ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే.. కెరీర్ లో తొలిసారిగా చేసిన స్పోర్ట్స్ డ్రామా `గని` (కిరణ్ కొర్రపాటి దర్శకుడు) వేసవి కానుకగా ఏప్రిల్ 8న తెరపైకి రాబోతోండగా.. `ఎఫ్ 2`కి సీక్వెల్ గా సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్ లో తెరకెక్కిన `ఎఫ్ 3` (అనిల్ రావిపూడి దర్శకుడు) సమ్మర్ సీజన్ లోనే (మే 27) వినోదాలు పంచనుంది. మరి.. 2022 సమ్మర్ లో `డబుల్ ధమాకా`తో ఒకే బాటలో వెళుతున్న కొణిదెల బ్రదర్స్ చరణ్, వరుణ్.. ఆయా చిత్రాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
![]() |
![]() |