![]() |
![]() |

ఆ మధ్య `సిరుత్తై`(`విక్రమార్కుడు` రీమేక్), `కాష్మోరా` చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసిన కోలీవుడ్ స్టార్ కార్తి.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న `సర్దార్` కోసం ముచ్చటగా మూడోసారి `డ్యూయెల్ రోల్` బాట పట్టారు. `అభిమన్యుడు` (తమిళంలో `ఇరుంబు తిరై`) ఫేమ్ పి.ఎస్. మిత్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కార్తికి జంటగా రాశీ ఖన్నా, రాజీషా విజయన్ నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఈ సినిమాతోనే ప్రముఖ హిందీ నటుడు చంకీ పాండే.. తమిళనాట తొలి అడుగేస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. `సర్దార్`లో కార్తి పోషిస్తున్న పాత్రలకి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఇందులో తండ్రీకొడుకులుగా ఈ టాలెంటెడ్ స్టార్ కనిపించబోతున్నారట. ఈ రెండు పాత్రలు కూడా వేటికవే విభిన్నంగా ఉంటాయని అంటున్నారు. మరి.. తండ్రీకొడుకుల పాత్రల్లో కార్తి ఏ స్థాయిలో ఆకట్టుకుంటారో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్. లక్ష్మణ కుమార్ నిర్మిస్తున్న `సర్దార్`కి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నాడు. జార్జి సి. విలియయ్స్ ఛాయాగ్రహణం అందిస్తున్నాడు.
![]() |
![]() |