![]() |
![]() |

ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా 'ఆర్ఆర్ఆర్' సెలెబ్రేషన్స్ షురూ అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. మార్చి 25 న విడుదల కానున్న ఈ భారీ మల్టీస్టారర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఓ సర్ ప్రైజ్ ఇచ్చింది.
'ఆర్ఆర్ఆర్ సెలబ్రేషన్ యాంథమ్'ను విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. 'ఎత్తర జెండా' అంటూ సాగే ఈ సాంగ్ ని మార్చి 14 న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. తారక్, చరణ్, ఆలియా భట్ ఉన్న ఈ కలర్ ఫుల్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. పంచెకట్టులో తారక్, చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

'ఎత్తర జెండా' సాంగ్ అప్డేట్ ని ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన రాజమౌళి ఓ ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు. మొదట ఈ సాంగ్ ని సినిమా చివరిలో ప్లే చేసి ఆడియెన్స్ కి సర్ ప్రైజ్ చేయాలనుకున్నామని, కానీ ఎక్సైట్ మెంట్ ఆపుకోలేక ముందే రిలీజ్ చేస్తున్నామని రాజమౌళి తెలిపారు.
![]() |
![]() |