![]() |
![]() |

'ఉయ్యాల జంపాల', 'పిట్టగోడ' చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించింది పునర్నవి భూపాలం. కానీ అవి ఆమె సినిమా కెరీర్‌కు ప్రయోజనం కల్పించలేకపోయాయి. కానీ టెలివిజన్‌లో బిగ్‌బాస్ సీజన్ 3 పునర్నవికి భారీ పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఈ షోలో రాహుల్ సిప్లిగంజ్‌తో పునర్నవి నడిపించిన లవ్ ట్రాక్ బాగానే పేలింది. ఈ షోకు భారీ స్థాయిలోనే టీఆర్పీని తెచ్చిపెట్టింది.
హౌస్ నుంచి బయటికి వచ్చాక రాహుల్‌ని పున్ను పెళ్లి చేసుకుంటుందా? అనేంతగా వీరి లవ్ ట్రాక్ జనాల్లోకి వెళ్లింది. అయితే బయటికి వచ్చాక ఈ ఇద్దరు తమ దారి తాము చూసుకున్నారు. పున్ను సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. ఆమె నటించిన వెబ్ మూవీ 'కమిట్‌మెంటల్' ఇటీవలే ఆహా ఓటీటీలో విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
ఇదిలా వుంటే పునర్నవి తాజాగా డేటింగ్ యాప్‌లకు సంబంధించిన సీక్రెట్‌ని బయటపెట్టేసింది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. ఎవరో తన ఫొటోలని డేటింగ్ యాప్‌లో పెట్టేసి హాసిని, తార పేర్లతో ప్రొఫైల్స్ క్రియేట్ చేశారని, ఈ విషయం తన ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుని షాకయ్యానని వెల్లడించింది.
పునర్నవే కాదు.. కొంతమంది సెలబ్రిటీల ముఖాలు డేటింగ్ యాప్ మోడల్స్‌గా దర్శనమిస్తూ కలవరం కలిగిస్తున్నాయి. ఆ యాప్‌లకూ, తమకూ ఎలాంటి సంబంధం లేదని వారు వివరణ ఇచ్చిన దాఖలాలున్నాయి.
![]() |
![]() |