![]() |
![]() |

'సుడిగాడు' సినిమాతో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న సూరత్ సుందరి మోనాల్ మరోసారి బిగ్‌బాస్ సీజన్ 4తో వార్తల్లో నిలిచింది. టైటిల్ ని దక్కించుకోలేకపోయినా అంతకు మించి పాపులారిటీని ఈ షో ద్వారా సొంతం చేసుకుంది. బిగ్‌బాస్ తో వచ్చిన పాపులారిటీతో ప్రస్తుతం మోనాల్ యమ బిజీగా మారిపోయింది. వరుస ప్రోగ్రామ్‌లే కాకుండా సినిమా ఆఫర్లతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది.
ప్రస్తుతం ఓంకార్ స్టార్ మా కోసం నిర్వహిస్తున్న 'డ్యాన్స్ ప్లస్' షోలో వన్ ఆఫ్ ద జడ్జ్‌గా వ్యవహరిస్తూ తనదైన గ్లామర్ హోయలతో ఆకట్టుకుంటోంది. ప్రతీ ఎపిసోడ్‌కి విభిన్నమైన కాస్ట్యూమ్‌ని ధరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మోనాల్ గజ్జర్. తాజాగా జరిగిన ఓ ఎపిసోడ్ కోసం ప్రత్యేకంగా బుస్తాబై వచ్చింది. వయిలెట్ కలర్ డ్రెస్ ధరించి ఈ షోకే వన్నె తెచ్చింది.
ఇందులో ట్విస్ట్ ఏంటంటే నాభి అందాలు చూపించేలా డిజైన్ చేసిన ఈ డ్రెస్‌ని ధరించి మోనాల్ నాభి పక్కన ఓ వైట్ స్టార్ ఆకారంలో చుక్క పెట్టుకుని అందాల విందు చేస్తూ హొయలు పోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఓంకార్ 'డ్యాన్స్ ప్లస్'కే మోనాల్ తన గ్లామర్‌తో ప్లస్‌గా మారడం విశేషంగా చెప్పుకుంటున్నారు.
.jpg)
![]() |
![]() |