![]() |
![]() |

బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాటలోనే.. అబ్బాయ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా వెళుతున్నాడు. మొన్నామధ్య పవన్ క్లాసిక్ హిట్ తొలిప్రేమ టైటిల్ ని రిపీట్ చేసి హిట్ కొట్టిన వరుణ్.. ఇప్పుడు బాలు చిత్రంలోని బాబాయ్ పవన్ క్యారెక్టర్ నేమ్స్ లో ఒకటైన గనిని తన నెక్స్ట్ వెంచర్ కి టైటిల్ గా చేసుకున్నాడు. అంతేకాదు.. బాబాయ్ బ్లాక్ బస్టర్ మూవీ తమ్ముడు తరహాలోనే బాక్సింగ్ కాన్సెప్ట్ తో పలకరించబోతున్నాడు.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. తమ్ముడు (1999) ఎలాగైతే జూలై నెలలో విడుదలైందో.. ఇప్పుడు గని కూడా అచ్చంగా జూలై నెలనే టార్గెట్ చేసుకుంది. అదేవిధంగా.. తమ్ముడు ద్వారా పి.ఎ. అరుణ్ ప్రసాద్ దర్శకుడిగా పరిచయమైతే.. గని ద్వారా కిరణ్ కొర్రపాటి డైరెక్టర్ గా ఫస్ట్ స్టెప్ వేస్తున్నాడు. అలాగే తమ్ముడులో ఉత్తరాది భామలు ప్రీతి జింగ్యాని, అదితి గోవీత్రీకర్ నాయికలుగా నటిస్తే.. గనిలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది.
మరి.. తమ్ముడు తరహాలోనే కామన్ పాయింట్స్ తోనే వస్తున్న గని కూడా సక్సెస్ ఫుల్ వెంచర్ గా నిలుస్తుందేమో చూడాలి.
![]() |
![]() |