![]() |
![]() |

కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన 'చందమామ' సినిమాలో టైటిల్ రోల్‌ను కాజల్ అగర్వాల్ పోషించి, ఆ పేరును సార్థకం చేసుకుంది. అదే సినిమాలో కాజల్ చెల్లెలుగా, శివబాలాజీ సరసన హీరోయిన్‌గా నటించిన సింధు మీనన్ గుర్తుందా? ఆ మూవీలో ఆమె తన చలాకీ నటనతో ఆకట్టుకుంది. ఎనిమిదేళ్లుగా సినిమాల్లో కనిపించని ఆమె ఇప్పుడు ఏం చేస్తోంది?
ఓ మలయాళీ ఫ్యామిలీలో బెంగళూరులో 35 ఏళ్ల క్రితం పుట్టింది సింధు. 1994లోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా కన్నడ సినిమాల్లో అడుగుపెట్టింది. 2001లో అంటే ఇరవై ఏళ్ల క్రితం డైరెక్టర్ ఎన్. శంకర్ దృష్టిలో పడి, రియల్ స్టార్ శ్రీహరి సరసన 'భద్రాచలం'లో హీరోయిన్ మహాలక్ష్మి క్యారెక్టర్ ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. తొలి సినిమాతోటే మన ప్రేక్షకులను అలరించింది సింధు.
అనంతరం త్రినేత్రం, శ్రీరామచంద్రుళ్లు, ఆడంతే అదో టైపు, చందమామ, రెయిన్‌బో, సిద్ధం, ప్రేమ పిలుస్తోంది చిత్రాలు చేసింది. చివరగా 2012లో 'సుభద్ర' అనే సినిమాలో టైటిల్ రోల్‌లో కనిపించింది. అదే ఆమె చివరి సినిమా. అంతకు ముందు తెలుగుతో పాటు, దక్షిణాదిలోని మిగతా మూడు భాషల.. తమిళ, కన్నడ, మలయాళం.. సినిమాల్లో నాయికగా నటించింది.
'సుభద్ర' సినిమా విడుదలకు రెండు సంవత్సరాల ముందే, అంటే 2010లోనే డొమినిక్ ప్రభు అనే ఓ తెలుగు సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది సింధు. అతనితో కలిసి యూకేకు వెళ్లిపోయి అక్కడే సెటిలయ్యింది. ఆనందకర దాంపత్య జీవితాన్ని గడుపుతున్న సింధుకు ఇద్దరు పిల్లలు.. ఓ అమ్మాయి, ఓ అబ్బాయి.

![]() |
![]() |