![]() |
![]() |

బుల్లితెర యాంకర్స్ ప్రోగ్రామ్‌లో కంటెంట్ కంటే వాళ్లు ధరించే కాస్ట్యూమ్స్‌కే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జిగేల్ మనిపించే డ్రెస్ కూడా ప్రోగ్రామ్‌కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. అందుకే చాలా మంది లేడీ యాంకర్స్ డ్రెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా భారీగా ఖర్చు చేస్తున్నారు కూడా. ఇలా యాంకర్‌లు ధరించిన స్పెషల్ కాస్ట్యూమ్స్ ఒక్కోసారి హాట్ టాపిక్‌గా కూడా మారుతున్నాయి.
తాజాగా యాంకర్ వర్షిణి సౌందరరాజన్ ధరించిన ఓ డ్రెస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. స్టార్ మాలో కొత్తగా ఓంకార్ 'కామెడీ స్టార్స్' పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి వ్యాఖ్యాతగా వర్షిణి సౌందరరాజన్‌ని నియమించిన ఓంకార్ న్యాయ నిర్ణేతలుగా ఆ బాధ్యతల్ని శేఖర్ మాస్టర్, నటి శ్రీదేవిలకు అప్పగించారు. ఇటీవలే ఈ ప్రోగ్రామ్ ప్రారంభమైంది.
ప్రారంభ ఎపిసోడ్‌లో వ్యాఖ్యాతగా బాధ్యతలు తీసుకున్న వర్షిణి పొట్టి గౌనులో దర్శనమిచ్చి షాకిచ్చింది. ఒక్కసారిగా స్టేజ్‌పై మెరుపులు మెరిపించింది. పొట్టి గౌనుకి ట్రాన్స్‌పరెంట్ క్లాత్ డిజైనర్ వేర్ తరహాలో లెగ్స్ కనిపించి కనిపించకుండా చేసింది. ఈ డ్రెస్‌లో వర్షిణిని చూసి ఓంకారే బిత్తరపోయాడు. న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న శేఖర్ మాస్టర్, శ్రీదేవి కూడా వర్షిణి అందాల షోకు ఒకింత కంగుతిన్నారు. వర్షిణి ఫ్యాన్స్ మాత్రం డ్రెస్ అదిరింది అంటూ పండగ చేసుకున్నారు.
.jpg)
![]() |
![]() |