![]() |
![]() |
.jpg)
బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ముంబైలోని ఫ్లాట్‌లో అతడి మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడని ప్రతి ఒక్కరూ ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. కొన్ని రోజులుగా మెంటల్ డిప్రెషన్ తో సుశాంత్ బాధ పడుతుండటంతో ఆత్మహత్య చేసుకున్నాడని భావించారంతా. అయితే, సుశాంత్‌ది ఆత్మహత్య కాదనీ, ఎవరో హత్య చేశారని అతడి మేనమామ ఆరోపిస్తున్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు సైతం అటువంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు.
"సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని మేం అనుకోవడం లేదు. అతడి మరణం వెనుక ఏదో రహస్యం ఉంది. పోలీసులు తప్పనిసరిగా దర్యాప్తు చేయాలి. సుశాంత్‌ని హత్య చేశారు" అని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనమామ వ్యాఖ్యానించారు. జన్ అధికార్ పార్టీ అధినేత పప్పు యాదవ్ "సుశాంత్ హత్యపై సిబిఐతో దర్యాప్తు చేయించాలి" అని డిమాండ్ చేశారు. పోలీసులు, మహారాష్ట్ర ప్రభుత్వం సహా కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్ పట్ల ఏ విధంగా స్పందిస్తుందో? వెయిట్ అండ్ సీ
![]() |
![]() |