![]() |
![]() |

జూన్ 15... మంచు ఫ్యామిలీ ఎప్పటికీ గుర్తుంచుకొనే మధురమైన రోజు. విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో డబుల్ సెలబ్రేషన్స్ చేసుకొనే రోజు ఇది. రెండు సెలబ్రేషన్స్ ఏంటి? అని సందేహం వచ్చిందా? ఒకటి... మోహన్ బాబు నట విశ్వరూపం చూపించిన సినిమాల్లో ఒకటైన 'పెదరాయుడు' విడుదలై నేటికి 15 సంవత్సరాలు. జూన్ 15న ఆ సినిమా విడుదలైంది. జూన్ 15నే లక్ష్మీ మంచు కుమార్తె విద్యా నిర్వాణ జన్మించింది.
'పెదరాయుడు' పాతికేళ్ల సెలబ్రేషన్స్, మనవరాలి పుట్టినరోజు... మంచు మోహన్ బాబు ఇంట ఈ రోజు రెండు పండగలు అన్నమాట. నిజానికి, 'పెదరాయుడు' పాతికేళ్ల పండుగను మోహన్ బాబు ఘనంగా సెలబ్రేట్ చేయాలని అనుకున్నారు. కానీ, కరోనా రావడంతో అటువంటి ప్రయత్నాలను విరమించుకున్నారు. ఆల్రెడీ 'పెదరాయుడు' తరహాలో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సబ్జెక్టు రెడీ చేయించానని, అందులో 'పెదరాయుడు'ను మించేలా నటీనటులు ఉంటారని కలెక్షన్ కింగ్ చెప్పారు. త్వరలో సినిమా పూర్తి వివరాలను ప్రకటిస్తానని ఆయన పేర్కొన్నారు.
![]() |
![]() |