![]() |
![]() |

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హఠాన్మరణం భారతీయ సినిమా ప్రముఖులతో పాటు సామాన్య ప్రేక్షకులను షాక్‌కి గురి చేసింది. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి... హిందీ టీవీ సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని, హీరోగా ఎదిగిన హీరో అర్థాంతరంగా లోకం విడిచి వెళ్లడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక, సుశాంత్ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.
సుశాంత్ సిస్టర్ శ్వేతా సింగ్ క్రితి అమెరికాలో ఉంటున్నారు. రేపు... అనగా ఈ నెల 16న అమెరికా నుండి శ్వేతా ఇండియాకి బయలు దేరుతున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో ఏడు రోజులు ఆమె క్వారంటైన్ లో ఉండక తప్పదు.
"ప్రతి ఒక్కరి సహాయంతో ఇండియాకి నా టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. అమెరికా టు ముంబై వయా ఢిల్లీ వస్తా. ఏడు రోజుల క్వారంటైన్ పీరియడ్ గురించి కలత చెందుతున్నాను. క్వారంటైన్ మాఫీ చేసే మార్గం ఏమైనా ఉందా? త్వరగా ఫ్యామిలీని కలవాలని అనుకుంటున్నాను" అని శ్వేతా సింగ్ క్రితి ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.
![]() |
![]() |