![]() |
![]() |

మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కొద్దిరోజులుగా న్యూస్ వినిపిస్తోంది. 'ఆర్ఆర్ఆర్' ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ ఎంటర్టైనర్ త్వరలోనే పట్టాలెక్కనుంది సమాచారం.
బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' ఈ నెల 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఆదిపురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్ K', 'స్పిరిట్' వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రభాస్ చేతిలో ఉన్నాయి. అలాగే మారుతి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రెండు నెలల్లోనే పూర్తవుతుందని చెప్పడంతో ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమా కోసం ప్రభాస్ కి భారీ రెమ్యునరేషన్ ముట్టనుందని టాక్.
ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెలలోనే రానుందని, వచ్చే నెల ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే దసరా లేదా దీపావళికి ఈ మూవీ రిలీజ్ కావొచ్చని అంటున్నారు. ఈ సినిమాకి 'రాజా డీలక్స్' టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.
గతంలో యంగ్ హీరోలతో యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ చేసి హిట్స్ కొట్టిన మారుతి స్టార్ హీరోలతో పెద్దగా పనిచేయలేదు. సీనియర్ హీరో వెంకటేష్ తో చేసిన 'బాబు బంగారం' నిరాశపరిచింది. మరి ప్రభాస్ తో హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్స్ జాబితాలో చేరిపోతాడేమో చూడాలి.
![]() |
![]() |