![]() |
![]() |

సెన్సేషనల్ హిట్ మూవీ `చంద్రముఖి`(2005)లో సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ కమెడియన్ వడివేలు మధ్య సాగే సన్నివేశాలు భలేగా ఎంటర్టైన్ చేశాయి. ఆ సినిమాకి ముందు `ముత్తు` (1995), తరువాత `కుసేలన్`(2008)లోనూ ఈ ఇద్దరు కలిసి నటించారు. కట్ చేస్తే.. 14 ఏళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం రజినీ, వడివేలు మరోమారు జట్టుకట్టనున్నారని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. `తలైవర్ 169` అనే వర్కింగ్ టైటిల్ తో ఈ భారీ బడ్జెట్ మూవీ రూపొందనుంది. ఆగస్టు నుంచి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కథానాయికగా ఐశ్వర్యా రాయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అంతేకాదు.. ఇందులో హాస్య నటుడు వడివేలు కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తారట. రజినీ, వడివేలు మధ్య సాగే కామెడీ ట్రాక్.. సినిమా ఎస్సెట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. త్వరలోనే `తలైవర్ 169`లో వడివేలు ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
కాగా, `తలైవర్ 169`కి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ బాణీలు అందించనున్నారు. 2023 ప్రథమార్ధంలో ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ థియేటర్స్ లో ఎంటర్టైన్ చేయనుంది.
![]() |
![]() |