![]() |
![]() |
.webp)
మొదటి ఆరురోజులు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల తుఫాన్ సృష్టించిన 'భీమ్లా నాయక్' ఏడు, ఎనిమిది రోజులలో డ్రాప్ అయిన సంగతి తెలిసిందే. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ లో ఆందోళన ఏర్పడింది. అయితే వీకెండ్ కావడంతో తొమ్మిదో రోజు మళ్ళీ పుంజుకుంది. తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 92 కోట్ల షేర్ రాబట్టింది.
రూ.106.75 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన భీమ్లా నాయక్ 108 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలోకి దిగింది. ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 88 కోట్ల షేర్ కలెక్ట్ చేసి వకీల్ సాబ్ టోటల్ కలెక్షన్స్(రూ.86.36)ని దాటేసింది. అయితే ఏదో రోజు, ఎనిమిదో రోజు ఊహించని దెబ్బ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో ఆరో రోజు రూ.3.32 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా ఏడో రోజు 98 , ఎనిమిదో రోజు 74 లక్షలకు పరిమితమైంది. తొమ్మిదో రోజు(శనివారం) వీకెండ్ కావడంతో కాస్త పుంజుకొని 1.07 కోట్లతో సత్తా చాటింది. నేడు(పదో రోజు) ఆదివారం కావడంతో మరోసారి కోటికి పైగా షేర్ రాబట్టే అవకాశముంది.
తెలుగు రాష్ట్రాల్లో 88.75 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ తొమ్మిది రోజుల్లో 72.21 కోట్లు రాబట్టింది. తెలంగాణలో 33.78 కోట్లు(35 కోట్ల బిజినెస్), ఆంధ్రప్రదేశ్ లో 38.43 కోట్లు(53.75 కోట్ల బిజినెస్) కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో 9 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన భీమ్లా నాయక్ తొమ్మిది రోజుల్లో 11.85 కోట్లు వసూలు చేసింది. రెస్టాఫ్ ఇండియా 9 కోట్ల బిజినెస్ చేసిన మూవీ ఇప్పటిదాకా 7.90 కోట్లు కలెక్ట్ చేసింది. తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 91.96 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన భీమ్లా నాయక్ క్లీన్ హిట్ గా నిలవాలంటే ఇంకా 16.04 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది.
![]() |
![]() |