![]() |
![]() |
.webp)
తెలుగునాట ప్రస్తుతం యువ సంగీత సంచలనం తమన్ హవా నడుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే.. ఇప్పుడు తను ఏం ముట్టుకున్నా బంగారమే అవుతోంది. గత ఏడాది చివరలో `అఖండ`తో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న తమన్ కి.. సంక్రాంతికి వచ్చిన లేట్ రిలీజ్ మూవీ `సూపర్ మచ్చి` అంతగా వర్కవుట్ కాకపోయినా.. గత నెలలో విడుదలైన రెండు సినిమాలు బాగా ప్లస్ అయ్యాయి.
ఆ చిత్రాలే.. `డీజే టిల్లు`, `భీమ్లా నాయక్`. ఫిబ్రవరి 12న వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ `డీజే టిల్లు`కి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ఓ ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్న తమన్.. ఆపై ఫిబ్రవరి 25న రిలీజైన మాస్ ఎంటర్టైనర్ `భీమ్లా నాయక్`తో సంగీత దర్శకుడిగా మరో సక్సెస్ చూశాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఊపులో ఉన్న తమన్.. ఇప్పుడు మరో సినిమాతో పలకరించబోతున్నాడు. ఆ చిత్రమే.. `రాధే శ్యామ్`. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ఈ పిరియడ్ లవ్ సాగాకి తమన్ నేపథ్య సంగీతమందించాడు. మరి.. మార్చి 11న రిలీజ్ కానున్న ఈ మూవీతో తమన్ ఖాతాలో హ్యాట్రిక్ పడుతుందేమో చూడాలి.
కాగా, `రాధే శ్యామ్`లో పూజా హెగ్డే కథానాయికగా నటించగా.. `జిల్` రాధాకృష్ణ దర్శకత్వం వహించారు.
![]() |
![]() |