![]() |
![]() |

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో 2021 సంవత్సరాంతంలో వచ్చిన `పుష్ప - ద రైజ్`తో చివరిసారిగా హిట్ చూశాడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్. ఆపై `రౌడీ బాయ్స్`, `గుడ్ లక్ సఖి`, `ఖిలాడి`, `ఆడవాళ్ళు మీకు జోహార్లు`.. ఇలా 2022లో ఇప్పటివరకు దేవి శ్రీ నాలుగు చిత్రాలతో పలకరించగా.. అవన్నీ కూడా నిరాశపరిచాయి. మొదటి మూడు నెలల్లో వరుసగా నాలుగు ఫ్లాప్స్ చూడడం డీఎస్పీకి అనూహ్యమే.
ఈ నేపథ్యంలో.. రాబోయే `ఎఫ్ 3`పైనే ఆశలు పెట్టుకున్నాడు దేవి శ్రీ. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. వేసవి కానుకగా మే 27న రాబోతోంది. మరి.. వరుస పరాజయాల్లో ఉన్న దేవి శ్రీ ప్రసాద్ కి ఈ మల్టిస్టారర్ అయినా ప్లస్ అవుతుందేమో చూడాలి.
Also Read: అచ్చిరాని మార్చిలో.. ప్రభాస్ మూడోసారైనా హిట్ కొడతాడా!?
కాగా, 2019 నాటి బ్లాక్ బస్టర్ మూవీ `ఎఫ్ 2`కి సీక్వెల్ గా రూపొందిన `ఎఫ్ 3`లో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, స్టన్నింగ్ బ్యూటీ మెహ్రీన్, సోనాల్ చౌహాన్, సునీల్ ముఖ్య పాత్రల్లో నటించారు. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ ని ప్రముఖ నిర్మాత `దిల్` రాజు నిర్మించారు.
![]() |
![]() |