![]() |
![]() |

'రాధే శ్యామ్' ట్రైలర్‌లో ప్రభాస్, పూజా హెగ్డే బెడ్‌పై శృంగారం జరుపుతున్న సీన్ పలువురి దృష్టిని ఆకర్షించింది. ఆ సీన్‌లో ఇద్దరూ టాప్‌లెస్‌గా దుప్పటి కింద ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ప్రత్యేకించి ఈ సీన్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని బాగా పెంచేసింది. మార్చి 11న థియేటర్లకు వస్తున్న ఈ మూవీలో ఆ ఇద్దరి మధ్యా ఇలాంటి ఇంటిమేట్ సీన్లు ఎన్నుంటాయోననే క్యూరియాసిటీ వారిలో వ్యక్తమవుతోంది. స్క్రీన్‌పై గతంలోనూ కొన్ని ఇంటిమేట్ సీన్స్ చేశాడు ప్రభాస్. అయితే కిస్సింగ్ సీన్స్ చేయాలన్నా, కెమెరా ముందు షర్టు తీసి టాప్‌లెస్‌గా కనిపించాలన్నా తను చాలా అసౌకర్యంగా ఫీలవుతానని అతను చెప్పాడు.
మీడియాతో మాట్లాడిన ప్రభాస్, "డైరెక్టర్ అలా రాసినప్పుడు, అందులోనూ అది లవ్ స్టోరీ అయినప్పుడు, నేనెలా కాదనగలను. అదే కమర్షియల్ ఫిల్మ్ అయితే, అలాంటివి ఎవాయిడ్ చేయగలం. కానీ లవ్ స్టోరీస్‌లో అది అవసరం. ఇప్పటికీ నేను కిస్సింగ్ సీన్స్ చేయాలన్నా, షర్టు విప్పాలన్నా ఇబ్బంది పడతాను. సెట్స్ మీద ఎంతమంది జనం ఉన్నారో గమనించి, వారిని అక్కడ్నుంచి ఇంకెక్కడికైనా వెళ్లమని చెప్తాను. 'ఛత్రపతి'లోనూ నాచేత షర్టు విప్పదీయించిన రాజమౌళి సార్, 'నువ్విప్పుడు ఏదైనా చెయ్యగలవు' అని చెప్పారు" అని తెలిపాడు.
'రాధే శ్యామ్' అనేది 1970లలో యూరప్ నేపథ్యంలో నడిచే లవ్ స్టోరీ. ప్రమోషనల్ వీడియోస్‌లో చూసినట్లు, చాలా కొత్త, భిన్నమైన కాన్సెప్టుతో ఈ సినిమా మన ముందుకు వస్తోంది. విక్రమాదిత్య అనే హస్తసాముద్రికునిగా ప్రభాస్, అతను ప్రేమించే ప్రేరణ అనే యువతిగా పూజా హెగ్డే నటించారు. ఆ ఇద్దరి మధ్యా అందమైన కెమెస్ట్రీ కుదిరినట్లు ట్రైలర్‌లోని ప్రతి ఫ్రేమ్ చూపిస్తోంది. రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలతో పాటు చైనీస్, జపనీస్ లాంగ్వేజెస్‌లోనూ రిలీజవుతోంది.
![]() |
![]() |