![]() |
![]() |

'బిగ్ బాస్'లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లలో క్యారెక్టర్ ఆర్టిస్టులు ప్రగతి, సురేఖ ఉన్నారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, వాళ్ళిద్దరూ ఆదివారం హౌస్‌లోకి అడుగుపెట్టలేదు. ప్రగతి అయితే తాను 'బిగ్ బాస్'లోకి వెళ్లడం లేదని కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. సురేఖ మాత్రం ఏ విషయం చెప్పలేదు.
షో స్టార్ట్ కావడానికి కొన్ని రోజుల ముందు సురేఖ జైపూర్ వెళ్లారు. అయితే, ఆమె వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీని ఆమె రీపోస్ట్ చేశారు. అందులో "నాగార్జునగారు... వైల్డ్ కార్డు ఎంట్రీలో సురేఖ, ప్రగతిని పంపించండి" అని అర్థం వచ్చేలా ఉంది.
'జబర్దస్త్' నుండి సుడిగాలి సుధీర్ టీమ్‌లో మెయిన్ మెంబెర్ రామ్ ప్రసాద్, మరో కమెడియన్ నరేష్ కూడా 'బిగ్ బాస్'కి వెళతారని ప్రచారం జరిగింది. అయితే, వాళ్ళెవరూ వెళ్ళలేదు. మరో జబర్దస్త్ టీమ్ లీడర్ ముక్కు అవినాష్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇస్తాడని టాక్. ఎంతవరకు నిజమో చూడాలి.
surekha ready for bigg boss wild card entry, star comedians ready for bigg boss wild card entry, wild card entry, surekha in bigg boss telugu 4 wild card entry
![]() |
![]() |