![]() |
![]() |

సెప్టెంబర్‌లో భర్త సామ్ బాంబే తనపై లైంగిక వేధింపులకు గురిచేశాడంటూ పోలీస్ కంప్లయింట్ ఇచ్చి, అతడిని అరెస్ట్ చేయించిన శృంగార తార పూనమ్ పాండే, లేటెస్ట్‌గా భర్తతో హ్యాపీగా కలిసున్న మరో ఫొటోను షేర్ చేసి, తమ ప్యారడైజ్‌లో అంతా బాగానే ఉందనీ, తామిద్దరం మళ్లీ కలిసిపోయామనీ తెలియజేసింది. తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఒకరినొకరు వాటేసుకున్న సెల్ఫీ వీడియోను షేర్ చేసిన ఆమె, దానికి "మిస్టర్ అండ్ మిసెస్ బాంబే" అనే క్యాప్షన్ పెట్టింది. అందులో ఆరెంజ్ కలర్ టాప్ ధరించిన ఆమె భర్తను వాటేసుకొని, అతడి ఛాతీపై తలపెట్టి నవ్వుతూ కనిపిస్తోంది.
ఇదివరకు సెప్టెంబర్ 26న తమ మధ్య గొడవలు జరిగిన కొద్ది రోజులకే, వెడ్డింగ్ డ్రస్‌లో ఉన్న తమ పిక్చర్‌ను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో సామ్ బాంబే షేర్ చేశాడు. దానికి అతను ఎలాంటి కాప్షన్ పెట్టలేదు. అయినప్పటికీ, ఆ పిక్చర్‌ను చూసిన వాళ్లంతా, కొత్తగా పెళ్లిచేసుకుని, దాదాపు విడాకులు తీసుకోవడం ఖాయంగా కనిపించిన ఆ ఇద్దరూ తిరిగి దగ్గరయ్యారని ఊహించారు.
ఆ తర్వాత అదే విషయాన్ని పూనమ్ ధ్రువీకరించింది. తమ మధ్య విభేదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపింది. ఆ వెంటనే "మేం తిరిగి ఒక్కటయ్యాం" అని చెప్పింది. "మీకు తెలుసా? మేం ఒకర్నొకరం టూ మచ్‌గా లవ్ చేసుకున్నాం. ఏ పెళ్లిలో గొడవలు జరక్కుండా ఉంటాయి?" అని ఎదురు ప్రశ్నించింది. ఇప్పుడు పూనమ్ పెట్టిన లేటెస్ట్ పోస్ట్‌తో ఆ ఇద్దరి మధ్య విభేదాలన్నీ సమసిపోయాయనీ, నిజంగానే మళ్లీ ఒక్కటైపోయారనీ అనిపిస్తోంది. అయితే ఈ పోస్ట్‌కు మిశ్రమ స్పందన వస్తోంది. "జనాల్ని పిచ్చోళ్లను చేస్తున్నారు కదరా" అని ఒకరు కామెంట్ పెట్టారు.
.jpg)
![]() |
![]() |