![]() |
![]() |

తెలుగు ప్రేక్షకులకు బాగా సన్నిహితురాలైన సమీరా రెడ్డి పెళ్లి చేసుకొని, ఇటు భార్యగా, అటు తల్లిగా బాధ్యతల్ని నిర్వర్తిస్తూ కాలం గడుపుతూ వస్తోంది. ఆమధ్య డిప్రెషన్ నుంచి ఎలా బయటపడ్డానో చెప్పుకొచ్చిన ఆమె.. ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా ఇంతకాలం తాను కోల్పోయిన ఆనందాల్నీ, ఇష్టాల్నీ ఎలా తిరిగి పొందిందో తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. కాలి గజ్జెలను చెవి దగ్గర పెట్టుకొని, వాటి చప్పుడును ఎంజాయ్ చేస్తున్నట్లు రెండు పిక్చర్లను ఆమె షేర్ చేసింది. ఒక పిక్చర్లో నవ్వుతూ, ఇంకో పిక్చర్‌లో కళ్లు మూసుకొని వాటి చప్పుడును ఆస్వాదిస్తూ ఆమె కనిపిస్తోంది.
.jpg)
"ఈ లాక్‌డౌన్‌లో మీకు బాగా ఇష్టమైన దాన్నేదైనా కనిపెట్టారా? ఇన్నేళ్లుగా నేను కోల్పోయిన నా ఇష్టాల్ని తిరిగి పొందడానికి ఈ లాక్‌డౌన్ నన్ను ఫోర్స్ చేసింది. పొయ్‌ని ప్రాక్టీస్ చేయడం, నా గజ్జెల చప్పుడు, పాడటం (నేను మంచి బాత్‌రూమ్ సింగర్‌ను), పిల్లలతో డాన్స్ చేయడం.. అంతేకాదు, ఇది వీడియోలను ఎడిట్ చేయడమనే ఇష్టాన్ని కనిపెట్టేలా చేసింది. నిజంగా ఇది బిగ్ లవ్‌గా మారిపోయింది. అలాగే, మా క్రేజీ 'మెస్సీ మామ అండ్ సాసీ సాసు' సిరీస్‌కు జన్మనిచ్చింది (ఎందుకంటే బిజీగా ఉండటానికి ఫన్ వీడియోస్‌ను రూపొందించాలని మంజరీ వర్దే, నేను డిసైడ్ చేసుకున్నాం). 2020 చాలా ఇబ్బందులు తెచ్చిన సంవత్సరం అని నాకు తెలుసు. అయితే అది మనకెన్నడూ ఉంటాయని తెలీని కోణాలకు కూడా జన్మనిచ్చింది." అంటూ రాసుకొచ్చింది సమీరా.
.jpg)
![]() |
![]() |