![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలకు ముందే 'నాటు నాటు' సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నాటు నాటు అంటూ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి వేసిన స్టెప్ ని వరల్డ్ వైడ్ గా ఎందరో రీల్స్ చేశారు. యూట్యూబ్ లో కూడా ఈ సాంగ్ లిరికల్ వీడియోకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 100 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇక తాజాగా 'నాటు నాటు' వీడియో సాంగ్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి మూవీ టీమ్ సర్ ప్రైజ్ ఇచ్చింది.
థియేటర్స్ లో 'నాటు నాటు' సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఓ బ్రిటిష్ అధికారి మీకసలు డ్యాన్స్ అంటే తెలుసా అంటూ నల్ల జాతీయుల గురించి అవమానకరంగా మాట్లాడిన సమయంలో 'నాటు నాటు' అంటూ భారతీయుల డ్యాన్స్ సత్తా చూపిస్తారు తారక్, చరణ్. ఇద్దరూ పోటాపోటీగా కోడె గిత్తల్లా చిందేస్తారు. ఇద్దరు స్టార్స్ కలిసి అలా డ్యాన్స్ చేయడం ఆడియెన్స్ కి ఐ ఫీస్ట్ అనిపించింది. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. విడుదలైన నిమిషాల్లోనే ఈ సాంగ్ కి రికార్డు స్థాయిలో వ్యూస్, లైక్స్ రావడం విశేషం. 24 గంటల్లో ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ లో సంచలన రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశముంది.

కీరవాణి స్వరపరిచిన ఈ సాంగ్ కి చంద్రబోస్ లిరిక్స్ అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఆలపించిన ఈ పాటకి ప్రేమ్ రక్షిత్ కోరియోగ్రఫీ చేశారు. అదిరిపోయే మ్యూజిక్, లిరిక్స్, వాయిస్, స్టెప్స్ కి తోడు తారక్, చరణ్ తోడవ్వడంతో ఈ సాంగ్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది.
![]() |
![]() |