![]() |
![]() |

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న 'గని' సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ దిశగా పయనమవుతోంది. రూ.25.30 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ దారుణ కలెక్షన్స్ రాబడుతూ బయ్యర్లకు 20 కోట్లకు పైగా నష్టం మిగిల్చే అవకాశముంది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 2.22 కోట్ల షేర్ రాబట్టిన గని రెండో రోజు 72 లక్షలు, మూడో రోజు 69 లక్షలకు పరిమితమైంది. దీంతో ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో 3.63 కోట్ల షేర్(6.40 గ్రాస్) కలెక్ట్ చేసింది. మూడో రోజుల్లో గని నైజాంలో 1.38 కోట్లు(8 కోట్ల బిజినెస్), సీడెడ్ లో 43 లక్షలు(3.50 కోట్ల బిజినెస్), ఆంధ్రాలో 1.82 కోట్లు(9.50 కోట్ల బిజినెస్) రాబట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 21 కోట్ల బిజినెస్ చేసిన గని ఇప్పటిదాకా 3.63 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది.
ఇక రెస్టాఫ్ ఇండియా 24 లక్షలు(2.50 కోట్ల బిజినెస్), ఓవర్సీస్ లో 31 లక్షలు(1.80 కోట్ల బిజినెస్) షేర్ వసూలు చేసిన గని.. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 4.18 కోట్ల షేర్(7.50 కోట్ల గ్రాస్) మాత్రమే కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 25.30 కోట్ల బిజినెస్ చేసిన గని బ్రేక్ ఈవెన్ కు ఇంకా 21 కోట్ల దూరంలో ఉంది.
ఓ వైపు 'ఆర్ఆర్ఆర్' ప్రభంజనం కొనసాగుతోంది. మరో వైపు 13 న 'బీస్ట్', 14 న 'కేజీఎఫ్-2' సినిమాలు ఉన్నాయి. గని వీకెండ్ లోనే ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఈరోజు, రేపు కలిపి మహా అయితే మరో 30-40 లక్షల షేర్ రాబట్టే అవకాశముంది. ఫుల్ రన్ లో ఈ సినిమా 5 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవడం కూడా కష్టమేనని అంటున్నారు. అదే జరిగితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 20 కోట్లకు పైగా నష్టాలతో భారీ డిజాస్టర్ గా నిలవనుంది.
![]() |
![]() |