![]() |
![]() |
.jpg)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. ఒకటి 'వకీల్ సాబ్' కాగా, మరొకటి క్రిష్ డైరెక్షన్‌లో చేస్తోన్న సినిమా. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా విధించిన లాక్‌డౌన్ నుంచీ వాటి షూటింగ్స్ ఆగిపోయాయి. పవన్ ఎప్పట్నుంచి వాటి షూటింగ్‌లో పాల్గొంటారు? అనే ప్రశ్న ఆయన ఫ్యాన్స్ నుంచి వస్తూ ఉంది. ఆ ప్రశ్నకు జవాబు దొరికింది. ఇప్పట్లో షూటింగ్‌కు వచ్చే ఆలోచనలో ఆయన లేరు. పవన్ కల్యాణ్ సినిమా సెట్స్ మీదకు రావాలంటే కరోనా కేసులు తగ్గాలి. అప్పటి దాకా నిర్మాతలు వెయిట్ చేయాల్సిందే.
ఈ విషయాన్ని గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు. ప్రస్తుత కాలంలో సోషల్ డిస్టాన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, షూటింగ్‌లో అది సాధ్యపడే విషయం కాదు కాబట్టి సెట్స్ మీదకు ఇప్పట్లో రానని ఆయన చెప్పకనే చెప్పారు. "కరోనా కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఈ టైమ్‌లో ఎవరినైనా షూటింగ్ కొనసాగించమని చెప్పడం సరైంది కాదు. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. కరోనా కేసులు బాగా తగ్గిపోయినప్పుడు మాత్రమే షూటింగ్స్ కొనసాగుతాయి" అని ఆయన స్పష్టం చేశారు.
పవన్ మాటలను బట్టి 2020 చివరి దాకా ఆయన సెట్స్ మీదకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.. అది కూడా అప్పటికి కేసులు తగ్గితేనే వస్తారు. చూస్తుంటే 2020 సంక్రాంతికైనా 'వకీల్ సాబ్'ను తీసుకు వద్దామనుకుంటున్న దిల్ రాజు సంకల్పం నెరవేరేట్లు కనిపించడం లేదు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'పింక్' రీమేక్ అయిన ఈ మూవీని శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్నాడు. నివేదా థామస్, అంజలి, అనన్య ప్రధాన పాత్రధారులు.
![]() |
![]() |