![]() |
![]() |
.jpeg)
సూర్య హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ వెట్రిమారన్ రూపొందిస్తోన్న చిత్రం 'వాడివాసల్'. కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్నారు. హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ కి ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ధనుష్, కలైపులి ఎస్. థాను, వెట్రిమారన్ కాంభినేషన్‌లో వచ్చిన 'అసురన్' బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్పగా తెరకెక్కిస్తున్నారు.
ఇప్పుడు ప్రముఖ రచయిత సీఎస్ చెల్లప్ప రాసిన నవల ఆధారంగా జల్లికట్టు నేపథ్యంలో 'వాడివాసల్' చిత్రం తెరకెక్కనుంది. సూర్య, వెట్రిమారన్ కాంభినేషన్‌లో ప్రెస్టీజియస్‌గా రూపొందుతోన్న ఈ మూవీ తమ బేనర్‌లో మరో సెన్సేషనల్ సినిమా కాబోతుందని నిర్మాత కలైపులి ఎస్. థాను అన్నారు. ఈ సినిమాకు సంబందించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు. తారాగణం ఎంపిక జరుగుతున్న జీవీ ప్రకాశ్ సంగీతం సమకూరుస్తుండగా, ఆర్. వేల్‌రాజ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.
.jpeg)
![]() |
![]() |