![]() |
![]() |

బిజూ మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్... మలయాళ సినిమా 'అయ్యప్పనుమ్ కోషియుమ్'లో ఇద్దరి పాత్రలు నువ్వా-నేనా అన్నట్టు ఉంటాయి. ఒకరిది ఎక్కువ, మరొకరిది తక్కువ అని చెప్పడానికి ఉండదు. స్క్రీన్ స్పేస్ నుండి హీరోయిజం చూపించే సన్నివేశాల వరకూ ఇద్దరివీ బావుంటాయి. కానీ, తెలుగులో పవన్ కళ్యాణ్ కోసం కథలో చాలా మార్పులు చేస్తున్నారని వినికిడి.
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో బిజూ మీనన్ పోషించిన పాత్రను తెలుగులో ఆయన చేయనున్నారు. ఈ సినిమాకి సాగర్ కె. చంద్ర డైరెక్టర్. పవన్ ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పర్యవేక్షణలో స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
పవన్ సూచన మేరకు అతడి పాత్ర నిడివిని పెంచి, మరో పాత్రను పూర్తిగా విలన్ చేస్తున్నారని టాక్. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్ర ప్రాధాన్యాన్ని తెలుగులో పూర్తిగా తగ్గిస్తున్నారట. వచ్చే ఏడాది సంక్రాంతి తరవాత ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించదానికి సన్నాహాలు చేస్తున్నారు.
![]() |
![]() |