![]() |
![]() |

"ఓ అద్భుతమైన అనుభూతి... చాలా రోజుల తరవాత అవుట్ డోర్ షూటింగ్‌కి వెళుతున్నాను" అని రానా దగ్గుబాటి ఎంతో సంతోషంగా చెబుతున్నారు. 'విరాట పర్వం' చిత్రీకరణ కోసం హైదరాబాద్ నగర శివార్లలోని అటవీ ప్రాంతాలకు వెళ్లినట్టు తెలుస్తోంది.
లాక్‌డౌన్‌కి ముందు రానా దగ్గుబాటి అవుట్ డోర్ షూటింగ్ చేశారు. మళ్ళీ అవుట్ డోర్‌కి ఇప్పుడు వెళ్తున్నారు. లాక్‌డౌన్‌లో, మళ్లీ అన్‌లాక్‌లో ఆయన షూటింగ్ చేశారు. అయితే... బయటకు ఎక్కడికీ వెళ్ళలేదు. స్టూడియోలో చేశారు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. మధ్యలో పెళ్లి చేసుకుని, హనీమూన్‌కి వెళ్లి వచ్చారు.
'విరాట పర్వం'లో అడవుల్లో ఉంటూ ప్రజల పక్షాన, ప్రజల కోసం పోరాటం చేసే అన్న పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నారు. ఆయనకు జంటగా సాయి పల్లవి, సినిమాలో ప్రధాన పాత్రల్లో ప్రియమణి, నందితా దాస్ తదితరులు నటిస్తున్నారు.
![]() |
![]() |